అన్నం తినాలా? వద్దా?
నేను అన్నం తినడం పూర్తిగా మానేశాను డాక్టర్! అయినా షుగర్ లెవెల్స్ తగ్గడం లేదు... బరువు తగ్గడం లేదు... ఇలా 80 శాతం క్లయింట్స్ చెప్పే విషయం. చిన్నప్పటి నుంచి అన్నం తిని పెరిగిన మనకు ఒక వయసు వచ్చేసరికి అన్నం విషం అయ్యింది. అన్నం తినాలా? వద్దా? అని తెగ అనుమానపడతాం.
అసలు అన్నం ఎందుకు మానమంటున్నారు?
ఎందుకంటే అన్నంలో గ్లిసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల. గ్లిసెమిక్ ఇండెక్స్ అంటే తిన్న ఆహారం వల్ల బ్లడ్ షుగర్‌లో వచ్చే మార్పు. అన్నానికి ఈ మార్పు ఎక్కువగా ఉంటుంది. అయితే గ్లిసమిక్ ఇండెక్స్ ఒక్కో ఫుడ్ ఐటెమ్‌ని విడిగా టెస్ట్ చేసి ఇచ్చే నెంబర్. మనం భోజనం కేవలం ఒక్క ఆహార పదార్థంతోనే చేయం. అన్నంలో కూరగాయలు, పప్పు, పెరుగు మొదలైనవి కూడా ఉంటాయి. అప్పుడు మొత్తం భోజనం గ్లిసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. సో.. అన్నం నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే అందరూ ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఏ ఆహారం అయినా అవసరానికి మించి తీసుకోరాదు.
రైస్ వల్ల లాభాలు...
- రైస్‌లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి అల్సర్స్, క్రానిక్ డిసీజ్ ఉన్న వారికి రైస్ మంచిది. ఎందుకంటే రైస్ జీర్ణకోశాన్ని ఇబ్బంది పెట్టదు.
- రైస్‌లో ఉన్న థియామైన్ (బి విటమిన్) మెటబాలిజానికి లాభం చేస్తుంది. ఆలోచనాశక్తిని పెంచుతుంది.
- రైస్‌లో ఉన్న అమినో యాసిడ్ కంపోజిషన్ త్వరగా కండపడుతుంది. అంతేకాదు మిథియోనైన్ అనే అమినో ఆమ్లం కాలేయంలో ఉన్న ఫ్యాట్‌ను సరఫరా చేస్తుంది. కాలేయ వ్యాధులున్నవారు రైస్‌ను తప్పక తీసుకోవచ్చు. థైరోసిన్ అనే అమినో యాసిడ్ వల్ల స్ర్టెస్ హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. పైగా సెరిటోనిన్, మెలటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మీటర్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి.
ఇదంతా చదివిన తర్వాత తలెత్తే ప్రశ్న వైట్ రైసా? బ్రౌన్ రైసా?
ఏ రైస్ అయినా సరే మితంగా తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే రైసే కాదు ఏ ఆహారం
మంచిది కాదు.
No comments:
Post a Comment